తెలంగాణ:పెట్రోల్,డీజిల్,గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో బహుజన్ ముక్తి పార్టీ ఆధ్వర్యంలో తోపుడు బండ్లతో నిరసన కార్యక్రమం జరిగింది. పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ ( పార్లమెంట్ ఇన్ఛార్జ్ గడ్డం విజయ్ )మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను రూ.400, కమర్షియల్ సిలిండర్ రూ.700కే అందించాలని కేంద్ర ప్రభుత్వ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన్ ముక్తి పార్టీ,బీసీ సంఘం,అంబేద్కర్ సంఘం నాయకులు ఉన్నారు.

