తెలంగాణ:సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ట్రాన్స్ఫార్మర్ల ఆయిల్, కాపర్ వైర్ల దోపిడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని పెదవీడులో వెలుగులోకి వచ్చింది.రెండు ట్రాన్స్ఫార్మర్ల నుంచి సుమారు 2400 లీటర్లు ఆయిల్‌తో పాటు కాపర్ వైర్లను దుండగులు దోచుకెళ్లినట్లు పేర్కొన్నారు.
గతంలో చోరీలు జరగడంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసినట్లు తెలిసింది.ఫ్యానల్ బోర్డుల్లోని కాపర్జ్లు,ఇతర సామగ్రిని కట్ చేసి కొంత భాగాన్ని అక్కడే వదిలివెళ్లారు.
ఈ ఘటనతో వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దొంగలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్న రైతులు, స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

