– ప్రకటన –
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రం శనివారం ఎస్ఐఆర్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలోని మద్నూర్‌లో పెద్దతడగూర్ గ్రామ డూప్లికెట్ ఓటర్ల జాబితాను రాష్ట్ర మాజీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ద్వారా బీఎల్ఏలకు మండలాధ్యక్షులు బన్సి పటేల్ శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని. నియోజకవర్గం వారీగా అర్హులైన ఏ ఒక్కరికి ఓటు గల్లంతు కాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఎల్ఏలు, బీఆర్ఎస్ పార్టీ, కార్యకర్తలు, గ్రామస్తులు నిర్వహిస్తున్నారు.
– ప్రకటన –

