రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. ఈ సినిమా గురువారం విడుదలై గ్రాండ్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. పెద్ది పాత్రలో రామ్ చరణ్ తన నటనతో అభిమానులను కట్టి పడేశారు. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం మామూలుగా లేదు. టాపాసులు కాలుస్తూ.. డిజెలు, బ్యాండ్ల మోతలతో నానా హంగామా చేస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు కూడా పేపర్లు విసురుతూ.. ఈలలు, కేకలతో గోల చేస్తున్నారు.
అయితే రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా తన భర్త సినిమాని ఓ అభిమానిగా వీక్షించారు. ఈ చిత్రం ప్రీమియర్స్‌లో ఉపాసన ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ బాలానగర్‌లో స్పెషల్ స్క్రీనింగ్‌కు వచ్చిన ఉపాసన, అభిమానుల మధ్య సినిమా చూసి వారిలో ఉత్సాహం నింపారు. రామ్ చరణ్ ఎంట్రీ సమయంలో పేపర్లు ఎగరేసి జోష్ పెంచారు. ఫ్యాన్స్‌తో పాటు ఆమె కూడా ఉత్సాహంగా అరుస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఉపాసన గారు RC ఎంట్రీ కోసం పేపర్లు విసురుతున్నారు ❤️ #పెద్ది #రాంచరణ్ #ఉపాసన pic.twitter.com/9g6Ng33eES
— జస్టిన్ తెలుగు (@JustinTelu59343) జూన్ 3, 2026

