పెద్ది OTT విడుదల తేదీ: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలై 11 రోజులు పూర్తి అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద జోరు ఏ మాత్రం తగ్గలేదు. నేడు రెండవ సోమవారం అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ నమోదు అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. టిక్కెట్ రేట్స్ తగ్గడం తో ఫ్యామిలీ ఆడియన్స్ మరోసారి ఈ సినిమాకు క్యూలు కట్టడం మొదలు పెట్టారు. ఆ కారణం చేతనే ఈ రోజు కూడా హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయని , మరో వారం రోజులు సాలిడ్ లాంగ్ రన్ ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రం నేడు కూడా తెలుగు రాష్ట్రాల నుండి 1.6 కోట్ల రూపాయిల షేర్ నుండి 1.8 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాబడుతుందని అంటున్నారు.
మొదటి సోమవారం ఉండాల్సిన ఈ నంబర్లు , రెండవ సోమవారం ఉందంటే , లాంగ్ రన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి బ్లాక్ బస్టర్ థియేట్రికల్ రన్ ఉన్న సినిమా , త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్. విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా 140 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. విడుదలైన నాలుగు వారాల తర్వాత , హిందీ మినహా మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ స్ట్రీమింగ్ థియేటర్‌కు నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. హిందీ వెర్షన్ 7 వారాల తర్వాత అందుబాటులోకి వస్తుంది. అయితే నిర్మాతలు కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం చూస్తే , ఈ సినిమా కచ్చితంగా జూలై 1 లేదా 2 తేదీలలో విడుదల అవ్వాలి. ఈ తేదీలలో విడుదల చెయ్యాలని నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా ఫిక్స్ అయ్యినట్టు చూపిస్తుంది.
వచ్చే వారం లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారు అట. మరోవైపు ఈ చిత్రం లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చికిరి చికిరి వీడియో సాంగ్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. అప్పుడే ఇంత మంచి పాటని యూట్యూబ్ లో విడుదల చేసినందుకు అభిమానులు మండిపడుతున్నారు. కేవలం ఈ పాటని థియేటర్స్ లో చూసేందుకు టిక్కెట్లు కొనుగోలు చేసే ఆడియన్స్ చాలా మంది ఉంటారని , అలాంటిది ఇంత తొందరగా విడుదల చేయడం వల్ల, ఆ టిక్కెట్స్ మొత్తం పోయినట్టే కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇకపోతే ఈ చిత్రం లో కొన్ని సన్నివేశాలను కట్ చేసి , మూడు కొత్త సన్నివేశాలను యాడ్ చేశారట. ఈ బుధవారం నుండి ఆ కొత్త సన్నివేశాలు థియేటర్లలో అందుబాటులోకి వస్తాయి.

