పెద్ది మూవీ దుబాయ్ ప్రివ్యూ షో టాక్: సోషల్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా అని తేడా లేదా , ఇప్పుడు ఎక్కడ చూసినా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మేనియా నే ప్రారంభించాడు. బుచ్చి బాబు ఇంటర్వ్యూ ఒక పక్క, రాష్ట్రాల వారిగా ఈవెంట్స్ డైరెక్టర్లు ని నాన్ స్టాప్ గా చేసారు. మొదటి నుండి మంచి బజ్ ఉన్న ఈ చిత్రం , ఇవన్నీ చెయ్యడం వల్ల, ఆ బజ్ తారాస్థాయికి చేరుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ చిత్ర సెన్సార్ సభ్యులు UA సర్టిఫికెట్ ని జారీ చేశారు. సెన్సార్ సభ్యుల నుండి ఈ చిత్రం మంచి పాజిటివ్ బజ్ ఉంది , ఆ రేంజ్ పాజిటివ్ బజ్ ఆడియన్స్ నుండి కూడా వస్తే , ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సునామీ ని ఎవ్వరూ ఊహించలేరు , ఆ రేంజ్ ఉండబోతుంది.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు దుబాయ్ లో కూడా పూర్తి అయ్యాయట. అక్కడి నుండి వస్తున్నా టాక్ కూడా వేరే లెవెల్ లో ఉంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఆరంభం కాస్త స్లో స్క్రీన్ ప్లే తో సాగిన, ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా వేరే లెవెల్ కి వెళ్తుందని, ఫస్ట్ లో రామ్ చరణ్ , జగపతి బాబు పెర్ఫార్మన్స్ లను ఆడియన్స్ జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని, అంత అద్భుతంగా వచ్చిందని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు ఈ సినిమా లో రామ్ చరణ్ నటన , బుచ్చి బాబు టేకింగ్ ఆడియన్స్ ని కంటతడి పెట్టించేలా ఉంటుంది , ఈ స్థాయి బావోద్వేగపూరిత చిత్రం ఈ మధ్యకాలం లో రాలేదని , ఇలాంటి సినిమాని రామ్ చరణ్ ఒప్పుకొని చాలా గ్రేట్ అంటూ చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా ఈ సినిమా చివరి 45 నిమిషాలు , ఆ తర్వాత క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తెలుగు సినిమా బ్రతికి ఉన్నంత కాలం ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారని , రామ్ చరణ్ చాలా అద్భుతంగా నటించాడని , నేషనల్ అవార్డు మాత్రమే కాదు , ఆయన్ని మనం త్వరలోనే ఈ సినిమా కారణంగా ఆస్కార్ వేడుకల్లో కూడా చూడొచ్చని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి. ఇండియన్ ఇండస్ట్రీలో మరో ‘డంగల్’, ‘లగాన్’ లాంటి చిత్రమంటూ ప్రచారం జరుగుతున్న ఈ సినిమా, నిజంగా ఆ రేంజ్ లో ఉంటే మాత్రం, కేవలం బాలీవుడ్ నుండే ఈ చిత్రం 500 కోట్ల గ్రాస్ ని రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

