- చరణ్ నటన, ప్రచారంతో ‘పెద్ది’ ప్రీమియర్లకు అద్భుత స్పందన లభించింది.
- సినిమాలలో ప్రీమియర్లతో 20.12 కోట్లు వసూలు చేసింది.
- ఏపీ ₹10.33 కోట్లు, నైజాం ₹6.46 కోట్లతో ప్రధాన వాటా.
- ‘ఓజీ’ తర్వాత 20 కోట్లు దాటిన మూడో భారతీయ చిత్రం.
Ram Charan Peddi Paid Premiere Collections: ‘పెద్ది’ రివ్యూలలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ గురించి ఎక్కువ మంది క్రిటిక్స్ మాట్లాడుతున్నారు. విడుదలకు ముందు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడారు. ‘పెద్ది’ టీజర్, పాటలు కూడా సినిమాపై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా అభిమానుల అంచనాలు పెరిగాయి. దాంతో ప్రీమియర్లకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కలెక్షన్స్ బాగా వచ్చాయి.
ఇండియాలో పెద్ది ప్రీమియర్స్ @ 20 కోట్లు
పెద్ది ఆల్ ఇండియా ప్రీమియర్స్ కలెక్షన్: ట్రేడ్ పోర్టల్స్ లెక్కల ప్రకారం… జూన్ 3వ తేదీ రాత్రి ‘పెద్ది’ సినిమాకు ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ ద్వారా రూ. 20.12 కోట్లు వచ్చాయి. ఏపీలో ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. టికెట్ రేట్స్ హైక్ విషయంలో అక్కడ ప్రభుత్వం నుంచి జీవో ముందుగా రావడం, అడ్వాన్స్ బుకింగ్స్ ఎర్లీగా స్టార్ట్ చేయడంతో జనాలు థియేటర్లకు బాగా వచ్చారు.
.
‘పెద్ది’ ప్రీమియర్స్ కలెక్షన్స్‌లో సగం అమౌంట్ ఏపీ నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రదర్శించిన ప్రీమియర్స్ ద్వారా 10.33 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ప్రీమియర్స్ పడటానికి కొన్ని గంటల ముందు మాత్రమే తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అయినా సరే సినిమా చెప్పుకోదగ్గ కలెక్షన్స్. నైజాం నుంచి ప్రీమియర్స్ ద్వారా 6.46 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత మూడు కోట్లు… ‘పెద్ది’కి ప్రీమియర్స్ ద్వారా ఎక్కువ వసూళ్లు కర్ణాటక నుంచి వచ్చాయి. టోటల్ ఆల్ ఇండియా ప్రీమియర్స్ గ్రాస్ కలెక్షన్స్ 20.12 కోట్లు.
కూడా చదవండి: Upasana At Peddi Premiere – ‘పెద్ది’ ప్రీమియర్‌లో ఉపాసన… పేపర్లు ఎగరేసిన రామ్ చరణ్ భార్య
‘ఓజీ’, ‘ధురంధర్ 2’ తర్వాత!
ఇప్పటి వరకు ఇండియాలో కేవలం ప్రీమియర్స్ ద్వారా 20 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు రెండు అంటే రెండు మాత్రమే. అందులో మొదటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఉంది. ప్రీమియర్స్ ద్వారా హయ్యస్ట్ కలెక్షన్స్… 20 కోట్ల క్లబ్బులో చేరిన మొదటి సినిమా ‘దే కాల్ హిమ్ ఓజీ’ రికార్డులకు ఎక్కింది. ఆ తర్వాత స్థానం రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2: ది రివేంజ్’ది. ఆ రెండు సినిమాల తర్వాత ప్రీమియర్స్ కలెక్షన్స్ గ్రాస్ 20 కోట్లు దాటిన సినిమా ‘పెద్ది’.
కూడా చదవండి: Peddi Review Rating In Telugu – పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏది?
‘పెద్ది’ సినిమాలోనూ అమెరికా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్టులో ‘పెద్ది’ ఆల్రెడీ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది. క్రిటిక్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. ఓపెనింగ్ డే కూడా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మంచి టాక్ లభించింది.
కూడా చదవండి: రామ్ చరణ్ Vs ఎన్టీఆర్ – రామ్ చరణ్ vs ఎన్టీఆర్… ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?
పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న ధర్మేంద్ర | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు

