Peddi Movie Rejected Star Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు రిలీజ్ అయి చాలా రోజులు అవుతుంది. ఇక ఇపంటో చరణ్నే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ హీరోగా చేసిన ‘పెద్ది’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా ఈ సినిమాకు మొదటి నుంచి కూడా భారీ హైప్ ఉండటం వల్ల ఈ సినిమా ప్రీమియర్ షోలు చూడడానికే చాలామంది ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమాని ఇంకొంచెం బాగా తీస్తుంటే బాగుండేది అని ఒక అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూడాలంటే ఒక డైలమాలో పడిపోయారనే చెప్పాలి. అయితే ఈ సినిమాని రామ్ చరణ్ కంటే ముందే ఒక ఇద్దరు హీరోలకైతే చెప్పారట. కానీ ఆ హీరోలు ఈ కథను రిజెక్ట్ చేయడంతో ఎట్టకేలకు రామ్ చరణ్ దగ్గరికి వచ్చింది. ఇక సుకుమార్ సహాయంతో రామ్ చరణ్ కి కథను వినిపించిన బుచ్చిబాబు సింగల్ సిటింగ్ లోనే కథను ఓకే చేయించుకున్నాడు.
సుకుమార్ ఉన్నాడనే ధైర్యంతో రామ్ చరణ్ కూడా బుచ్చిబాబు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే మొదట బుచ్చిబాబు ఈ కథను ఎవరికి వినిపించాడు. వాళ్లు ఈ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశారు అనే విషయంలోనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తితో ఉన్నారు.
అయితే ఈ సినిమా కథని మొదట బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించాడు. ఎన్టీఆర్ ఈ కథ విషయంలో కొన్ని సందేహాలను వ్యక్తం చేశారట. కొన్ని మార్పులు చేర్పులు చేయమని కూడా చెప్పారట.అయినప్పటికి బుచ్చిబాబు వినన ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఇక ఎన్టీఆర్ తర్వాత ఈ కథని తమిళ్ స్టార్ హీరో సూర్యకి వినిపించారు.
సూర్య కూడా ఈ కథ విషయంలో అంత సంతృప్తి చెందాడు అతను ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఇక ఎట్టకేలకు రామ్ చరణ్ వద్ద కైతే వచ్చింది. ఈ సినిమా చూసిన కొంత మంది ప్రేక్షకులు ఎన్టీఆర్, సూర్య ఈ సినిమా చేయకపోవడమే మంచిదైంది అంటూ వాళ్ళు ఈ సినిమా నుంచి తప్పించుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు…

