గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్, మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ ట్రైలర్‌తో ఈ చిత్రం మొత్తం అంచనాలను ఆకాశానికెత్తేసింది. ఈరోజు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో ‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించింది. జనసందోహం మధ్య జరిగిన ఈ ఈవెంట్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
భోపాల్ ప్రజల ఆత్మీయతకు ముగ్ధుడైన రామ్ చరణ్ మాట్లాడుతూ.. “నా మనసులో మధ్యప్రదేశ్ ప్రజలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ‘పెద్ది’ ప్రమోషన్స్ ఇక్కడి నుంచే ప్రారంభించడం నాకు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. నా కెరీర్లో ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసినప్పటికీ. హృదయాలకు నేరుగా చేరుతుందనే నమ్మకం నాకుంది అని స్టేజ్‌పై సంచలన ప్రకటన చేశారు.
ఈ సినిమా కథాంశంపై చరణ్ మరింత క్లారిటీ ఇస్తూ “’పెద్ది’ అనేది ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ మాత్రమే కాదు. సమాజంలో తన ఉనికి కోసం, తన గుర్తింపు కోసం ఒక వ్యక్తి చేసిన సుదీర్ఘ పోరాటం. ఆ ఎమోషనల్ జర్నీ మీ హృదయాలను తాకుతుంది. గతంలో మీరంతా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంపై ఎలాంటి భారీ ప్రేమను అందించారో.. అదే ప్రేమను ‘పెద్ది’కి కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అయ్యాక మా ‘పెద్ది సక్సెస్ టూర్’ కూడా ఇదే భోపాల్ నగరంలో గ్రాండ్‌గా జరుపుకుంటాం” అని రామ్ చరణ్ తన స్పీచ్‌ను ముగించారు.

