పెద్ది 9 రోజుల ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. నేడు కూడా ఈ బుక్ మై షో యాప్ లో గంటకు 12 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఒక స్టార్ హీరో సినిమా వారం రోజులు దాటిన తర్వాత కూడా బుక్ మై షో యాప్ లో ఇలాంటి ట్రెండ్ ఉండటం చివరిసారిగా ‘ఓజీ’ సినిమా చూశాము , మళ్లీ ఈ సినిమాకే చూస్తున్నాం. ఇకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద దిగ్విజయంగా ఈ చిత్రం 9 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకొని 10 వ రోజులోకి అడుగుపెట్టింది. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రం 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 296 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా ఈ సినిమాకు ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.
నైజాం ప్రాంతంలో ఈ చిత్రం 48 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, 9 రోజుల్లో 48 కోట్ల 41 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టి లాభాల్లోకి అడుగుపెట్టింది. అదే విధంగా సీడెడ్ ప్రాంతంలో ఈ చిత్రం దాదాపుగా 18 కోట్ల 44 లక్షల రూపాయల షేర్ వసూళ్లు ఈ 9 రోజుల్లో వచ్చాయి. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో అయితే ఈ సినిమా మొదటి రోజు నుండి ఏ మాత్రం జోరు తగ్గకుండా సంచలనాత్మక రికార్డులను నమోదు చేసుకుంది. ట్రేడ్లకు అందజేసే లెక్కల ప్రకారం చూస్తే , ఈ నవంబర్ 9 రోజుల్లో 19 కోట్ల 51 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. నేడు ఈ ప్రాంతం ప్రతితాత్మక 20 కోట్ల క్లబ్‌లోకి చేరనుంది.
ఇక తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే 9 రోజుల్లో దాదాపుగా ఈ చిత్రం 11 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతం లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది ఈ చిత్రం. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 8 కోట్ల రూపాయిలు , గుంటూరు జిల్లాలో 11 కోట్ల 48 లక్షల రూపాయిలు , కృష్ణా జిల్లాలో 9 కోట్ల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 5 కోట్ల 12 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రం 131 కోట్ల 32 లక్షల రూపాయల షేర్ వసూళ్లు , 196 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 13 కోట్ల 10 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 3 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 10 కోట్ల 10 లక్షల రూపాయిలు ఓవర్సీస్ నుండి 21 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టి , ఓవరాల్ గా 178 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు , 296 కోట్ల రూపాయల చిత్రాలతో రూ. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 41 కోట్ల 85 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

