ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి అనంతరం భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన ఆవేదనను, జట్టు వైఫల్యాలను బాహాటంగా పంచుకున్నారు. టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో, పెద్ద జట్లతో ఆడేటప్పుడు జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని ఆమె అంగీకరించింది.
హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. “చివర్లో మేము బోర్డుపై ఒక మంచి స్కోరును ఉంచగలిగాము. బ్యాటింగ్‌లో ఆ పరుగులను రాబట్టలేకపోతున్నాం” ఇది చాలా కాలంగా జరుగుతోంది.
పెద్ద జట్లతో ఆడేటప్పుడు వ్యూహాలు మారాలి..
“ఈ టోర్నమెంట్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాము. సాధారణంగా బలమైన జట్లతో తలపడేటప్పుడు మన అత్యుత్తమ ఆట బయటకు రావాలి. జట్లను ఎలా ఎదుర్కోవాలో, మా వ్యూహాలను ఎలా మార్చుకోవాలో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది” అని హర్మన్‌ప్రీత్ స్పష్టం చేశారు.

