చికెన్ వంటకాలంటే ఎవరికైనా ఇష్టమే.. లొట్టలేసుకుంటూ తింటున్నాం.. బిర్యానీ, ఫ్రై, కర్రీ గ్రిల్ ఇలా రకరకాల వంటకాలుగా వండుకుని తింటారు.అయితే వీటిలో వాడే మ్యారినేడ్ అత్యంత కీలకం అంటున్నారు పోషకాహార నిపుణులు. మ్యారినేడ్ అనేది చికెన్, మాంసం, చేప వంటకాలకు రుచిని, సువాసనను ఉంచే వాటిని మెత్తగా మార్చడానికి వాడే ఒక ప్రత్యేకమైన ద్రవ మిశ్రమం. ప్రతి సుగంధ ద్రవ్యాలు, నూనెలు, ,నిమ్మరసం లేదా పెరుగు వంటి పుల్లని పదార్థాలు ఉంటాయి. చాలామంది చికెన్ బ్రెస్ట్ రెసిపీ వండుకొని తినే ఉంటారు.. ఈ రెసిపీలో పెరుగులో చికెన్ బ్రెస్ట్ ను నానబెట్టి తర్వాత నూనెలో ఫ్రై చేస్తారు. అయితే నూనె, పెరుగు వాడకుండా చికెన్ బ్రెస్ట్‌ని వండుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమని అంటున్నారు డైటీషియన్లు.
పెరుగు లేదా నూనె వాడకుండా చికెన్ బ్రెస్ట్‌ను మరింత జ్యూసీగా మార్చే ఓ మ్యారినెడ్ను సంధ్యా బాలాజీ అనే డైటీషియన్, ఫిట్నెస్ కోచ్ షేర్ చేశారు. ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిదంటున్నారు. చికెన్ బ్రెస్ట్ అనేది చాలా తక్కువ సంతృప్త కొవ్వు ,కేలరీలు కలిగిన, కడుపు నింపే ఉత్పత్తులలో ఒకటి. అయితే దీనిని ప్రతిరోజూ తినడం విసుగు తెప్పించవచ్చు. అలాగే, చికెన్ బ్రెస్ట్‌ను వండటం వల్ల అది తరచుగా పొడిబారిపోతుంది. ఇలా సమస్యలు రుచిగా లేకుండా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా బెస్ట్ మారినేడ్ రెసిపీని మనకు అందించారు.
మ్యారినేషన్ కోసం కావలసిన పదార్థాలు
- ఈ మ్యారిన్డ్ 500 గ్రాముల చికెన్ బ్రెస్ట్కు ఖచ్చితంగా సరిపోతుంది..
- 1 టేబుల్ స్పూన్ కారం పొడి
- 2 టేబుల్ స్పూన్ల పెరి పెరి మసాలా
- 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి
- 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా
- ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- ½ టేబుల్ స్పూన్ నిమ్మరసం
- 1 పూర్తి గుడ్డు
- రుచికి తగినంత ఉప్పు
తయారీ పద్ధతి..
శుభ్రంగా కడిగిన బ్రెస్ట్ చికెన్ పీసులు
ఒక గిన్నెలో అన్ని పదార్థాలను బాగా కలిపి, చికెన్‌కు పూర్తిగా పట్టేలా కలపండి.
చికెన్‌ను 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి.
అదంతా పూర్తయ్యాక, చికెన్‌ను 190°C వద్ద 10 నుంచి 12 నిమిషాల పాటు ఎయిర్-ఫ్రై చేయండి.
ఈ వంటకంలో పెరుగు లేదా నూనె వాడరు..అయినా కూడా మీకు పొడిబారని, రబ్బరులా లేని చికెన్ లభిస్తుంది. ఈ పద్దతిలో మృదువైన, టేస్టీగా ప్రోటీన్‌తో నిండిన చికెన్ బ్రెస్ట్ లభిస్తుంది.
చికెన్ బ్రెస్ట్ ఎందుకు తినాలి?…
చికెన్ అధిక పోషక విలువలతో ప్రోటీన్‌కు మంచి వనరుగా ఉంటుంది. దీనిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. పెరుగుదలకు ,ఎముకల ఆరోగ్యానికి బెస్ట్ వన్ ఇది. చికెన్‌లోని అన్ని భాగాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, ఛాతీ భాగం అత్యంత పోషకమైనది. ఎందుకంటే, శరీర కణజాల మరమ్మత్తు ,రోగనిరోధక శక్తిని పెంచడంలో, శక్తిని వృద్ధి చేయడంలో సాయపడే పోషకాలు ఇందులో ఉంటాయి. అదనంగా, తొడలు, కాళ్లు ,రెక్కలతో ప్రస్తుతం ఇందులో సంతాప కొవ్వు తక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు గురించి ఆందోళన చెందుతున్న వారికి ఇది ఒక ఉత్తమ ఎంపిక. ఇంకా లీన్ ప్రోటీన్ అయినందున చికెన్ గుండె ,రక్తనాళాల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.
సో.. చికెన్ బ్రెస్ట్ తినాలనుకుంటే పైన చెప్పిన పదార్థాలతో టేస్టీ, టేస్టీ , ఆరోగ్యకరమైన చికెన్ వండుకొని తినండి. ఆరోగ్యంగా ఉండండి.

