హిందువులు ఒకప్పుడు వస్త్రధారణ.. బట్టలు.. దుస్తులకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఇక పెళ్లిళ్లు.. పండుగలు.. ఫంక్షన్ ల సమయంలో మహిళలు వేసుకొనే బట్టలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక వివాహిత మహిళలు సాధారణంతా రెడ్.. గ్రీన్.. బ్లూ ఇలాంటి కలర్ డ్రస్‌లకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఎట్టి పరిస్థితిలో తెల్ల రంగు బట్టలను ఉపయోగించరు. దీనికి గల ఆధ్యాత్మిక రహస్యాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
వివాహిత మహిళలు ప్యూర్ వైట్ కలర్ డ్రస్ ఎట్టిపరిస్థితిలో ఉపయోగించారు. పురాణాల ప్రకారం తెలిపిన వివరాల ప్రకారం తెల్లని రంగు వైరాగ్యం.. అశాంతి.. చాలా కఠినంగా ఉండేందుకు సూచికను పండితులు అంటున్నారు.
పండితులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లని రంగు కోరికల త్యాగానికి ప్రతీక. వివాహిత మహిళలు అందంగా లక్ష్మీదేవి వలె అలంకరించుకుంటారు. అలంకరణ వారి భర్త అదృష్టంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి వివాహిత స్త్రీలు తెల్లని దుస్తులు ధరించరు. మరో ముఖ్య విషయం ఏంటంటే వివాహిత స్త్రీలకు మహిళలు తెల్లని రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. అందుకే వివాహిత స్త్రీలు తెల్లని దుస్తులు ధరించడం నిషిద్ధమని పండితులు చెబుతున్నారు.
►ఇంకా చదవండి | జ్యోతిష్యం:రాత్రిపూట భయంతో నిద్రపట్టడం లేదా.. వెల్లుల్లితో ప్రతికూల శక్తిని వెళ్లగొట్టండి..!
సనాతన ధర్మంలో తెలుపు రంగు యొక్క ప్రాముఖ్యతహిందూ సనాతన ధర్మంలో, అంత్యక్రియల సమయంలో తెల్లటి దుస్తులు ధరించడం అనేది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం. దుఃఖంతో నిండిన సమయంలో మనసును స్థిరంగా ఉంచడానికి తెలుపు సరైన ఎంపికగా భావిస్తారు.
దుఃఖ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచే ఉద్దేశ్యంతెల్లటి దుస్తులు ధరించే ప్రధాన ఉద్దేశ్యం, విచారంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు మానసిక శాంతి కల్పించే విషయంలో… భావోద్వేగపూరితమైన సమయంలో మనుషులు ఈ రంగును ఎంచుకుంటారు. కాబట్టి వివాహిత మహిళలు తెల్లని రంగు వస్త్రాలను ధరించరని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. . .
నిరాకరణ: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల్లోని సమాచారం మేరకు.. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించి రూపొందించారు. ఈ జాబితా V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించారు. మీకున్న జ్యోతిష్య సమస్యల నిపుణులను సంప్రదించడం ఉత్తమం

