లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకులేటి రమేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి వెంకటేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కంటి శాస్త్ర చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో 85 మంది కంటి రోగులు హాజరు కావడం లేదని వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించి 65 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరందరికీ లైన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశామని చెప్పారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు బద్దల వెంకటరామయ్య, కీర్తిశేషులు బద్దెల బాలమ్మ, కీర్తిశేషులు బీవీ రత్నయ్య, కీర్తిశేషులు బి వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు నిర్వహించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సీనియర్ ,జూనియర్ సభ్యులు ఉన్నారు.

