– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రతి గుడిసెకు ఇంటి పట్టా అందించడం, ప్రతి పేద కుటుంబానికి శాశ్వత గృహం కల్పించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో మహాధర్నా జరుగుతుంది. ఈ మహాధర్నాలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, నిరాశ్రయ పేదలు, గుడిసెవాసులు ఉన్నారు. ఈ మహా ధర్నాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
– ప్రకటన –

