పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం.. రాజమండ్రిలోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త గేట్లను ఏర్పాటు చేసే పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు 50 ఏళ్ల కింద ఒకసారి ఈ గేట్లు మార్చారు.. వాటిలో సుమారు 64 గేట్లు తుప్పుపట్టాయి. మరికొన్నింటికి వైరింగ్ దెబ్బ తింది. దీనితో వాటిని మార్చే కార్యక్రమానికి కూటమి సర్కారు నడుం బిగించింది.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో 32 గేట్లను మార్చింది. ఇప్పుడు తాము కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నాము. ఒక్క గొడవే కాకుండా.. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా.. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినని దుయ్యబట్టారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తాము తీసుకున్నామని.. ఆరు నూరైనా ఈ ప్రాజక్టు తొలిదశను వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. గోదావరి పుష్కరాల నాటికి.. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామన్నారు. పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని తెలిపారు. ప్రాజెక్టులే రాష్ట్రానికి ఆర్థిక వనరులని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. వాటిని పూర్తి చేసి.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
పవన్ కల్యాణ్ మంచి మిత్రుడు
కూటమి ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ ఒక మంచి మిత్రుడని చంద్రబాబు ఉన్నాడు. ప్రస్తుతం ఆ యన కుడిభుజానికి ఆపరేషన్ అయిందని.. తాను ముంబై వెళ్లి పరామర్శించి వచ్చానని. ఇప్పుడే ఆయన విధుల్లోకి వస్తానని చెప్పగా.. పూర్తిగా కోలుకున్నాకే రావాలని కోరినట్టు వెల్లడించారు. పవన్ కల్యాణ్ వంటి మిత్రులు కూటమికి ఎంతో అవసరమని సూచించింది. వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం దక్కించుకుంటోంది.. మొత్తం అన్ని స్థానాల్లోనూ గెలిచినా ఆశ్చర్యం లేదు.

