ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ మేరకునే కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు ప్రధాని మోదీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంకా గాంధీ, ఖర్గే తదితర నేతలు ప్రయత్నించారు. దాదాపు 4 గంటలపాటు ప్రధాని నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ గాంధీతో పాటు మిగిలిన కాంగ్రెస్ నేతలను బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి వేరే చోటికి వాహనాల్లో ఉంచారు. పోలీసులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అంతుకుముందు, ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ కలిశారు. రాహుల్ తో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత జితేందర్ సింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. భద్రతా కారణాల రీత్యా అక్కడి నుంచి వెళ్లిపోవాలని రాహుల్ ను ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో రాహుల్ గాంధీపై కీలక ఆరోపణలు చేశారు.
నీట్ పరీక్ష గురించి చర్చ జరగాలని రాహుల్ కోరారని, అందుకు సానుకూలంగా స్పందించామని జితేందర్ సింగ్ గాంధీ చెప్పారు. అయితే, ఆ తర్వాత రాహుల్ గాంధీ మాట మార్చారని, ధర్మేంద్ర ప్రధాన రాజీనామా డిమాండ్ పై కూడా చర్చ జరగాలని కోరారని అన్నారు. అంతేకాదు, నీట్ పై ఏ సమయంలో చర్చించాలో కూడా కాంగ్రెస్ నేతలు చెప్పలేదని ఆయన చెప్పారు.
కాగా, ఢిల్లీలో జరుగుతున్న నిరసనల సెగ హైదరాబాద్ ను కూడా తాకింది. సీజేపీకి మద్దతుగా హైదరాబాద్ లో విద్యార్థి సంఘాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సోమాజిగూడలోని లోక్ భవన్ ను ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా ఈడ్చుకువెళ్లి వాహనాల్లో వేరే చోటికి వచ్చారు.

