విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : జిల్లా ఎస్పీ పి.జగదీష్ వెల్లడించిన వివరాల ప్రకారం ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా పర్యవేక్షణలో ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి శుక్రవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో స్థానిక కిమ్స్ సవీరా ఆసుపత్రి వారి సౌజన్యంతో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్స్ సవీరా ప్రముఖ అంకాలజిస్ట్ వెంకట సింహ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల రక్షణలో తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పోలీసు సిబ్బందికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలియజేసారు. క్యాన్సర్ మహమ్మారి పట్ల ప్రాథమిక దశలోనే అప్రమత్తంగా ఉంటే, సరైన చికిత్స ద్వారా దానిని పూర్తిగా నయం చేయవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీతో పాటు ఆర్ ఐలు మధు, పవన్ కుమార్, ఆర్ ఎస్ ఐలు జాఫర్ (పోలీసు అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు) బాబ్జాన్ , రమేష్ నాయక్ , జిల్లా పోలీసు అధికారుల సంఘం సహాయక కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్ , గాండ్ల హరినాథ్ , శివప్రసాద్ , ఆనంద్ మరియు కిమ్స్ సవీరా ఆసుపత్రి అధికారులు, వైద్య సిబ్బంది, పోలీసు అధికారులు.

