తపాల ఉద్యోగుల ఆవేదన
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల ప్రధాన తపాలా కార్యాలయం ముందు విపరీతమైన చెత్తచెదారం వేస్తున్నారని మున్సిపల్ అధికారులు వెంటనే తొలగించాలని తపాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తపాలా పనిచేసే ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించలేకపోతున్నారని, ఆ వాసన భరించలేకపోతున్నారని వారు బాధను వ్యక్తం చేశారు. దానితో పాటు చెత్త ఎత్తిన తర్వాత గాలికి ఎగిరి బయటకు వస్తున్నదని, దీనితో దుర్వాసన మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కావున ఆ చెత్తను అక్కడి నుండి వేయకుండా వేరే చోటుకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ కి వచ్చి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, మానవతా దృక్పథంతో మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చెత్త చెదారం సమస్య రోజురోజుకు అధికమవుతుందని, ప్రజలతోపాటు తపాలా ఉద్యోగులు కూడా అనారోగ్యానికి గురవుతారని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఆఫీస్ కార్యాలయం ముందు చెత్త వేయకుండా తగిన చర్యలు చేపట్టి ఆరోగ్యాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు.
పోస్ట్ పోస్ట్ ఆఫీస్ ముందు ఉన్న వ్యర్థధార్థాలను తొలగించండి.. మొదట కనిపించింది విశాలాంధ్ర.

