వైభవ్ సూర్యవంశీ : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలి అంటారు. కానీ ఇవి సూర్య యంగ్ సెన్సేషన్ వంశీ కి అంతగా వంటబట్టినట్లు లేవు. పైగా అతడికి క్రికెట్లో నిదానంగా ఆడాలని.. సావధానంగా పరుగులు తీయాలని అర్థమైనట్టు లేదు. అందువల్లే కొంప మునిగిపోయింది. రారా అంటూ నినాదాలు చేసిన వారే పో పో అంటూ పంపించారు.
వైభవ్ ఆట ఎలా ఉంటుంది..అతడి ఎటాకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే అతడు విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్ లో అనితర సాధ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. గొప్ప గొప్ప బౌలింగ్ కలిగి చీల్చి పడేశాడు. ఫోర్ల వర్షం కురిపించాడు. సిక్సర్ల సునామి సృష్టించాడు. బీభత్సం అంటే ఎలా ఉంటుందో.. అలా బ్యాటింగ్ చేశాడు.
అతని ఆట తీరు చూసి ముచ్చటపడిన మేనేజ్మెంట్ ఐరిష్ సిరీస్ కోసం ఎంపిక చేసింది. అయితే ఆ సిరీస్లో అతడికి ఆడే అవకాశం లభించలేదు. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. అతడికి చోటు కల్పించాలని ఏకంగా ఉద్యమం నడిచింది. చివరికి మేనేజ్మెంట్ అతనికి అవకాశం కల్పించింది. ఈ సిరీస్ ద్వారా అతడులోకి ప్రవేశించాడు. అంతర్జాతీయ మ్యాచులు ఆట మొదలు పెట్టాడు. కానీ ఆశించిన స్థాయిలో ఆడ లేకపోయాడు. గొప్పగా పరుగులు చేయలేకపోయాడు. ఫలితంగా ఐదవ టి20 మ్యాచ్ కి స్థానమే కోల్పోయాడు.
సూర్య వంశీ గురించి మొదట గొప్పగా చెప్పినవారు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. అతడి ఆట తీరు చూసి నిర్వేదం వ్యక్తం చేశారు. ఐపీఎల్లో అదరగొట్టిన అతడు సిరీస్లో తేలిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రతీబంతిని గట్టిగా కొట్టాలంటే అతడి తాపత్రయం చూసి. అతడి ఆటతీరు మూడు మ్యాచ్లలో ఒకేతీరుగా ఉండటంతో మేనేజ్మెంట్ ఐదో మ్యాచ్కి దూరం పెట్టింది. ఈ దూరం ఇలానే సాగుతుందా.. తదుపరి మ్యాచ్లలో కూడా కొనసాగుతుందా.. చూడాల్సి ఉంది.

