హైదరాబాద్: ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ఈ చర్య పూర్తిగా కాలరాసిందని ఆయన తెలిపారు.
ప్రజాస్వామ్య హక్కుపై దాడి చేసిన పోలీసుల తీరును ఆయన అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ యువత తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందని, కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నామని సీఎం రేవంత్ ఆయన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు.
శ్రీను అరెస్టు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను @రాహుల్ గాంధీ జీ, శ్రీమతి @ప్రియాంకగాంధీ జీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు. నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కుపై ఇది దాడి.
మొత్తం @INCindia కుటుంబం మరియు దేశం మన యువతతో దృఢంగా ఉంది, వారు జవాబుదారీతనం కోసం డిమాండ్ చేస్తున్నారు… pic.twitter.com/OUlFNPcCyh
– రేవంత్ రెడ్డి (@revanth_anumula) జూలై 21, 2026
మీరు మమ్మల్ని జైల్లో వేయవచ్చు, మమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నించవచ్చు కానీ, న్యాయం, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న లక్షలాది మంది యువ భారతీయుల ఆగ్రహాన్ని మీరు అణచివేయలేరు అని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరును సోషల్ మీడియా సాక్షిగా ఎండగట్టారు.
కాక్రోచ్ పార్టీ నిరసనకారులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ మోదీ ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నాకు దిగింది. ఈ ధర్నా నుంచి పోలీసులు బలవంతంగా రాహుల్ గాంధీని ఈడ్చుకెళ్లారు. ఈ కారణంగా ఆయనకు గాయమైంది. ముక్కు నుంచి రక్తం కారింది. వీడియోల్లో, ఫొటోల్లో ఆయన ముక్కు వెంట రక్తం స్పష్టంగా కనిపించింది.
రాహుల్ గాంధీపై పోలీసుల దాష్టీకంపై కాంగ్రెస్ కార్యకర్తలు. రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తస్రావం వచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోకుండా బలవంతంగా చేతులు, కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కారు. ఈ ఉంది.. ఆయన కంటి కింద, చేతిపై గాయాలయ్యాయి.

