భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో అరుదైన టైటిల్ ను గెలుచుకున్నాడు. నార్వే చెస్ టైటిల్ ను భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద గెలిచాడు. దీనితో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఖాతాలో మరొక టైటిల్ పడినట్లయింది. జర్మనీ ఆటగాడు విన్సెంట్ కైమర్పై విజయం సాధించి, 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
తొలి భారతీయుడిగా…
ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద రికార్డు నెలకొల్పాడు. టోర్నమెంట్లో వరల్డ్ నంబర్-1 మాగ్నస్ కార్ల్సన్ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించాడు. ప్రజ్ఞానంద టైటిల్ గెలవడంపై ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు అభినందనలు తెలిపారు.

