స్పందన హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం: ప్రతి వ్యక్తి షుగర్ పరీక్షలు నిర్వహించి, అందుకు తగిన మందులను ఉపయోగిస్తూ చక్కటి ఆరోగ్యాన్ని ఉంచుకోవాలని స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా స్పందన హాస్పిటల్ ఆధ్వర్యంలో పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్లోని జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ఉన్నత పాఠశాల ముందు ఆవరణలో ఉచిత షుగర్ పరీక్షల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉదయం 7 నుండి 10 గంటల వరకు 140 మందికి షుగర్ పరీక్షలు నిర్వహించి, షుగర్ ఉన్న ఎడల ఎటువంటి మందులు వాడాలి? ఎలాంటి వైద్య చికిత్స పొందాల్సి ఉంటుంది అన్న విషయం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పందన హాస్పిటల్స్ సిబ్బంది దిల్దార్, చందన, చలపతి, షారిక్ జరిగింది.
పోస్ట్ ప్రతి వ్యక్తి షుగర్ పరీక్షలు నిర్వహించుకోవాలి.. మొదట కనిపించింది విశాలాంధ్ర.

