తెలంగాణ:రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్ఠాత్మకంగా బ్రేక్ ఫాస్ట్ అండ్ మిల్క్ స్కీమ్‌ను(అల్పాహారం మరియు పాల పథకం) ప్రారంభించింది.రూ.720 కోట్ల వ్యయంతో ఈ పథకం ద్వారా ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు చదువుతున్న సుమారు 29 లక్షల మంది విద్యార్థులకు పోషకాహారం అందించనున్నారు.
ఈ పథకం కింద సోమవారం, బుధవారం,శుక్రవారం విద్యార్థులకు పాలు, మంగళవారం,గురువారం, శనివారం రాగి మాల్ట్ అందించనున్నారు.అలాగే దోసె,పూరీ,మిల్లెట్ ఇడ్లీ, పొంగల్,బోండా వంటి పోషకాహార అల్పాహారాలను మెనూలో చేర్చారు.
విద్యార్థుల పోషకాహార స్థాయిని నిక్షేపించడం,పాఠశాల హాజరును పెంచడం, చదువుపై ఏకగ్రతను పెంచడం,డ్రాప్ అవుట్లను తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది.హైదరాబాద్ నగరంలో తొలి దశలో 45 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12,437 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
ఈ మన్నా ట్రస్ట్ అమలులో ఉంది.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

