విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు, చేనేత ప్రముఖులు నీలూరి వెంకటస్వామి తన వంతుగా కళాశాలకు 25 వేల రూపాయల నగదును ప్రిన్సిపాల్ వనిత వానికి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల చదువులోనూ, క్రమశిక్షణ పొందడం వల్ల తనకు ఈ సహాయాన్ని అందించడం జరిగింది. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ కళాశాల అభివృద్ధి కోసం విరాళం అందించిన దాత నీలూరు వెంకట స్వామి కికళాశాల అభివృద్ధి కమిటీ తరుపున బండి వేణుగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జుబిన్ తాజ్, మల్లికార్జున, వనిత, సునీత ఉన్నారు.

