ప్రశ్న రావణ్ : భావ స్వేచ్ఛ ప్రతీ ఒక్కరికి , అది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ దేశం లో మనకి నచ్చని అంశాల మీద, ఐడియాలజీ మీద , వ్యక్తుల పైన , రాజకీయ పార్టీలపైనా విమర్శలు చేయొచ్చు , అందులో ఎలాంటి తప్పు లేదు , విమర్శలు ఉండాలి , అప్పుడే మన సమాజం లోని సమస్యలకు పరిష్కారాలు వెతకగలం. అయితే బావ స్వేచ్ఛ ప్రకటన అంటూ , అవతల వ్యక్తిపై ఇష్టమొచ్చినట్లుగా నోరు పారేసుకోమని రాజ్యాంగం చెప్పలేదు. ఇంట్లో ఆడవాళ్ళని దూషించమని, అసభ్య పదజాలంతో రెచ్చిపోమని చెప్పలేదు , ఒక మతాన్ని కించపర్చామని కూడా చెప్పలేదు. ఇవన్నీ చట్ట రీత్యా నేరం, ఇన్ని చేసిన వ్యక్తులను వదిలేస్తే సమాజానికే అత్యంత ప్రమాదకరం. అందుకే ప్రశ్న రావణ్ ని అరెస్ట్ చేయించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
మొన్న అర్థ రాత్రి హైదరాబాద్ లో ఉంటున్న రావణ్ ఇంటికి వెళ్లిన పిఠాపురం పోలీసులు , ఆయన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే జడ శ్రవణ్ కుమార్ రావణ్ కి మద్దతుగా నిలిచి , ఆయన తరుపున వాదించి బెయిల్ ఇప్పించారు. అయితే 2025వ సంవత్సరం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సర్పవరం లో రావణ్ పై పోలీస్ కేసు నమోదైంది. దీంతో ఆయనకు బెయిల్ వచ్చిన వెంటనే సర్పవరం పోలీసులు వచ్చి రావణ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే నిన్న పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద కానీ , నేడు సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద కానీ , పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో అభిమానులు చేరుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ‘డౌన్ డౌన్ రావణ్’ అని అరుస్తూ, ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షం లో అతన్ని వదిలేయాలని డిమాండ్ చేశారు.
ఇక నేడు సర్పవరం పోలీస్ స్టేషన్ నుండి రావణ్ ని కోర్టు కి తరలిస్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని రావణ్ పై గుడ్ల వర్షం కురిపించారు. పోలీసులు అతనికి రక్షణ కల్పిస్తూ , చాలా సురక్షితంగా కోర్టుకి తీసుకెళ్లారు. చూస్తూనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈసారి రావణ్ ని వదిలిపెట్టేలా లేరు , గతం లో ఇతను పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అలా ఉన్నాయ్ మరీ. అంతే కాకుండా పిఠాపురం కి వెళ్లి , చిన్న పిల్లలు కొట్టుకుంటే, దాంట్లో కూడా కుల విద్వేషాలను రెచ్చగొట్టాలని చూసాడు, ఇలాంటి వారిని అరెస్ట్ చేయడంలో చాలా ఆలస్యం చేశారు అనేది నెటిజెన్స్ వాదన. ఇక రావణ్ పై దాడి వీడియో ని మీకోసం ఎక్సక్లూసివ్ గా క్రింద అందించాము చూడండి.

