గచ్చిబౌలి, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో ఓ మహిళ తన భర్తను చంపించింది. పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. శనివారం మృతుడి భార్య, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని శేరిలింగంపల్లి డీసీపీ ఆఫీస్‌లో డీసీపీ శ్రీనివాస్ కేసు వివరాలను శనివారం మీడియాకు ఏర్పాటు చేశారు. పటాన్ చెరు చైతన్యనగర్‌కు చెందిన బైండ్ల నవీన్(24) వాల్యూజోన్ పక్కన చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. అదే కంపెనీలో పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన రాయిగల్ల శేఖర్(36) గూడ్స్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ విధంగా నవీన్, శేఖర్ల మధ్య స్నేహం ఏర్పడింది.
శేఖర్‌కు ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో నవీన్ డబ్బు సహాయం చేసేవాడు. ఇదే సమయంలో నవీన్ అప్పుడప్పుడు శేఖర్ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ శేఖర్ భార్య ప్రమీల(27)తో నవీన్‌కు పరిచయం ఏర్పడింది. ఈ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రమీల ఏడు నెలల గర్భిణి. భర్తకు ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో నవీన్ వీరికి ఆర్థికంగా సహాయం చేసేవాడు. ఒకరోజు ఇంట్లో తన భార్యతో నవీన్ సన్నిహితంగా ఉండటంతో శేఖర్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో శేఖర్ తన భార్యను కొట్టి, నవీన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. తమ అక్రమ సంబంధానికి శేఖర్ అడ్డు వస్తున్నాడని, ఎలాగైనా అతడిని అంతమొందించాలని నవీన్, ప్రమీల ప్లాన్ వేశారు.
- మద్యం మత్తులో బండరాయితో కొట్టి హత్య..
ఈ నెల 15న ఒకసారి కలుద్దామని శేఖర్‌ను నవీన్పటాన్చెరులోని క్యాండస్ ఇంటర్నేషనల్ స్కూల్ వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రదేశానికి రప్పించాడు. అక్కడ ఇద్దరు కలిసి మద్యం తాగారు. శేఖర్ మద్యం మత్తులో ఉండగా నవీన్ తన డబ్బులు ఎప్పుడో తిరిగి ఇస్తావని, ప్రమీలను ఎందుకు వేధిస్తున్నాడని గొడవ పడ్డాడు. అక్కడే ఉన్న ఓ బండరాయిని తీసుకొని శేఖర్తలపై బలంగా కొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు శేఖర్ స్పాట్ లోనే మృతి చెందాడు. మృతదేహాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించిన నవీన్ కొద్దిదూరం లాక్కెళ్లి ఆ తర్వాత మృతదేహంపై అట్టముక్కలు పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
హత్య కోసం శేఖర్ భార్య ప్రమీలకు నవీన్ ఫోన్ చేసి చెప్పాడు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పటాన్చెరు పోలీసులు స్పాట్‌కు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతుడు ఇస్నాపూర్‌కు చెందిన శేఖర్‌గా గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. శేఖర్ యేసుదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శేఖర్ హత్యపై భార్య ప్రమీలను అడగ్గా తనకేమి తెలియదని పోలీసులను తప్పుదోవ పట్టించింది.
ఇంకా నవీన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించింది. అయితే, పోలీసులకు అనుమానం వచ్చి ప్రమీలను తమదైన శైలిలో ప్రశ్నించడంతో హత్య విషయం పోలీసులకు చెప్పింది. దీంతో పటాన్ చెరు పోలీసులు ప్రమీలతో పాటు ఆమె ప్రియుడు నవీన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.

