మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్ ఆ లోటు తీర్చిందని భావించిన వాళ్ళు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో సానుకూలత ఎక్కువగా కనిపించింది. నటనతో అదరగొట్టిన సత్యదేవ్ కు సూపర్ డూపర్ హిట్ వచ్చిందేమో అనే రేంజ్ లో హడావిడి కనిపించింది. ఓవర్సీస్ లో స్ట్రాంగ్ ఉన్న మాట వాస్తవమే. కానీ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అంత దూకుడు లేదన్నది వాస్తవం.
మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ అండ లేకుండా ఏ మూవీ బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు. కేవలం మూవీ లవర్స్ ని లక్ష్యంగా చేసుకుంటే లాభం లేదు. రావు బహదూర్ ఈ విషయంలో తడబడ్డారు. దర్శకుడు వెంకటేష్ మహా పోస్ట్ రిలీజ్ ప్రెస్ మీట్ లోకి థర్డ్ యాక్ట్, ప్రోబ్లం సాల్వింగ్ సాంకేతిక పదాలు వాడేసి నెమ్మదిగా తన టేకింగ్ ని సమర్థించే ప్రయత్నం చేశారు. జనం థియేటర్ కు వచ్చేది స్కూల్ పిల్లల శ్రద్ధగా పాఠం వినడం కోసం కాదు. సరదాగా టైంపాస్ కోసం వస్తారు.
సో టెక్నికల్ గా మనలో ఎంత విషయం ఉందనేది టికెట్లు కొనుక్కునే పబ్లిక్ కి అనవసరం. వాళ్లకు కావాల్సింది రెండున్నర గంటలు సంపూర్ణంగా మెప్పించడం. రోజా, బొంబాయి లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ తీసిన మణిరత్నం కడలి, చెలియా లాంటి పరమ బోరింగ్ సినిమాలు ఇచ్చారు. కల్ట్ ఫిలిం మేకరే ఇలాంటివి చవి చూడాల్సి వచ్చింది. ఎంగేజ్ చేయకుండా మనం ఎంత గొప్ప కథ రాసుకున్నా అది అన్ని వర్గాలను రీచ్ కాదు. ప్రతి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే.
రావు బహదూర్ ఖచ్చితంగా రికమండ్ చేయాల్సిన క్యాటగిరీలో వస్తుంది. అలాని కుటుంబం మొత్తం టికెట్లు కొనేసి సంతోషంగా బయటికి పంపించేదా అంటే సమాధానం చెప్పలేం. ఎందుకంటే మా ఇంటి బంగారం, మన శంకరవరప్రసాద్ గారు, పెద్దిలాగా ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. ఎక్స్ పెరిమెంట్లు చేసినప్పుడు ఆదరణ పరిమితంగానే ఉంటుంది. ఆ రిస్కుని దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీయాలి. మరి రావు బహదూర్ ఏ స్టాంప్ వేయించుకుంటుందో ఇంకో రెండు మూడు రోజుల్లో తేలనుంది.

