పిల్లల భవిష్యత్తు కోసం అప్పుల బాటలో తల్లిదండ్రులు….
విశాలాంధ్ర-నార్పల (అనంతపురం జిల్లా) : ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్న ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా ఛార్జీల భారంతో మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యను అందించాలని తల్లిదండ్రులు అప్పులు చేయడం, బంగారం తాకట్టు పెట్టడం, ఇతర కుటుంబ అవసరాలకు సంబంధించిన పరిస్థితులకు దిగజారడం.నేటి పోటీలో తమ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలనే ఆశతో ఎక్కువ మంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలే ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు మెరుగుపడినప్పటికీ, సమాజంలో పెరిగిన పోటీ భావన కారణంగా ప్రైవేట్ విద్యకు ఇస్తున్నారు. ఒకరి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండటాన్ని చూసి మరొకరు కూడా అదే మార్గాన్ని ఎంచుకుంట కుటుంబానికి అదనపు ఆర్థిక భారం పడుతోంది.
ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, బుక్స్, యూనిఫాం ఇతర విద్యా సామగ్రిని పాఠశాలల ద్వారా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో తక్కువ ధరలకు లభించే వస్తువులు పాఠశాలల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో విద్యా ఖర్చులు పెరిగి కుటుంబ బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది.
పిల్లల చదువుల కోసం నెలవారీ ఆదాయంలో అప్పుల కోసం వెచ్చించాల్సి వస్తోంది, ఫీజు చెల్లింపుల చెల్లింపులు చేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. పెరుగుతున్న విద్యా వ్యయాలు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ)తో పాటు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు స్పందించి ఫీజులు అందజేసే స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, ఇతర విద్యా సామగ్రి సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆశిస్తున్నారు. విద్యను వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా భావంతో అందించడం, మధ్యతరగతి కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఫీజుల నిర్ణయం తీసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

