తెలంగాణ:ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు,ప్రొఫెసర్ నాగేశ్వర్రావును (ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు )అరెస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు చేరుకున్నారంటూ సోషల్ మీడియా,రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది.ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది.
అయితే ఇదే సమయంలో హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ నాగేశ్వర్రావు నివాసం వద్ద తెలంగాణ పోలీసులు మోహరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.ఆంధ్రప్రదేశ్ పోలీసులు (ఆంధ్రప్రదేశ్ పోలీస్ )వచ్చి అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో భద్రతాపరంగా తెలంగాణ పోలీసులు అప్రమత్తమైనట్లు సమాచారం.
ఇదిలా ఉండగా,ఒక రాష్ట్రానికి చెందిన మరో పోలీసులు రాష్ట్రంలో అరెస్ట్ చేయాలంటే స్థానిక పోలీసుల అనుమతి,సమన్వయం అవసరమని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిజంగానే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే తెలంగాణ పోలీసులు అనుమతి ఇస్తారా? లేక అడ్డుకుంటారా? అన్న అంశంపై రాజకీయ,న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.మరోవైపు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రొఫెసర్ నాగేశ్వర్రావు కూడా న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అరెస్ట్‌కు విచారణ జరుగుతోంది.

