ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే తెర తీసింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసిన సందర్భంగా జగన్ అరెస్టుపై చర్చ జరిపిన నాగేశ్వర్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
నాగేశ్వర్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో నాగేశ్వర్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ మద్దతు లభిస్తుండగా… కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పించారు. నాగేశ్వర్ అవినీతి నిరూపించారంటూ మల్లన్న.
పవన్ చెప్పినట్లుగా జగన్ అరెస్టుకు అమిత్ షా ససేమిరా అన్నారని నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా చంద్రబాబు తనకు పార్ట్ టైం మిత్రుడని, జగన్ దీర్ఘకాల మిత్రుడని కూడా అమిత్ షాలుగా నాగేశ్వర్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై జనసేన భగ్గుమనగా… నాగేశ్వర్ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు.
వ్యాఖ్యల ఉపసంహరణ తర్వాత ఆయనపై ఏపీలో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో నాగేశ్వర్ కు మద్దతు అమాంతం పెరుగుతుండగా… కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పించారు.
సోమవారం నాటి పత్రికల్లో 10టీవీ షేర్ల బదిలీ గురించిన ఓ వార్త రాగా… అందులో మతలబు పేరు ప్రఖ్యాతిగాంచింది. ఇదే విషయంపై తాను ఓ రోజు ముందుగానే గుర్తు ఆరోపణలు చేశానని మల్లన్న చేశారు.
తన ఆరోపణలు చూసిన నాగేశ్వర్ తనపై పరువు నష్టం దావా వేస్తానని వేరే వ్యక్తి వద్ద అన్నారని కూడా మల్లన్న గుర్తు చేసుకున్నారు. దమ్ముంటే నాగేశ్వర్ తనపై పరువు నష్టం దావా వేయాలని, వేస్తే ఏమవుతుంది? ఇంకో కేసు పెరుగుతుందని ఆయన సెటైర్లు సంధించారు.
10 టీవీ షేర్ల బదిలీ పక్కనపెడితే… 10 టీవీ పేరు మీద నాగేశ్వర్ పేదోళ్ల పైసలు తిన్నారని మల్లన్న సంచలన ఆరోపణలు గుప్పించారు. విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ కేసు విచారణ జరిగితే… ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను తాను అందిస్తానని ఆయన పేర్కొన్నారు.
10 టీవీ పేరు మీద పేదోళ్లు, కార్మికుల పైసలను నాగేశ్వర్ తిన్న వ్యవహారానికి సంబంధించి తాను నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తున్నానని చెప్పిన మల్లన్న.. దమ్ముంటే నాగేశ్వర్ విచారణకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. వెరసి నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు మరింత రసకందాయంలో పడిందని చెప్పక తప్పదు.

