FIFA వరల్డ్ కప్ 2026లో గందరగోళం: ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్‌లో భాగంగా బెల్జియం వర్సెస్ సెనెగల్ జట్ల మధ్య జరిగిన పోరులో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే ఒకేసారి గుర్తు తెలియని వ్యక్తులు (పిచ్ ఇన్వేడర్స్) భద్రతా వలయాన్ని ఛేదించుకుని స్టేడియంలోకి దూసుకురావడంతో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో రెఫరీ వెంటనే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి వారిని పట్టుకునేందుకు మైదానమంతా పరుగులు తీశారు.
స్టేడియంలో హై డ్రామా.. నెట్టింట వీడియోలు వైరల్:
మ్యాచ్ 24వ నిమిషంలో సెనెగల్ ప్లేయర్ హబీబ్ దియారా కొట్టిన అద్భుతమైన గోల్ కారణంగా ఆ జట్టు 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 32వ నిమిషంలో బెల్జియం జట్టు బంతిని పాస్ చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ భద్రతా లోపం బయటపడింది. మైదానంలోకి దూసుకొచ్చిన వారిలో ఒక వ్యక్తి సెక్యూరిటీ సిబ్బందికి దొరకకుండా కాసేపు ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు సిబ్బంది అతనిని పట్టుకుని కిందకు నెట్టేయడంతో స్టేడియంలోని ప్రేక్షకులు నానా హంగామా చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఇంతమంది ఒకేసారి మైదానంలోకి ఎలా రాగలిగారంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
భద్రతపై పెరుగుతున్న ఆందోళన:
సెక్యూరిటీ సిబ్బంది ఆ తెలిసిన వ్యక్తులను మైదానం బయటకి పంపించి, పరిస్థితి అదుపులోకి తెచ్చిన తర్వాత మ్యాచ్ మళ్లీ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగింది. కానీ, ఈ ఘటనతో ఫిఫా ప్రపంచకప్ స్టేడియాలలో భద్రతా ప్రమాణాలపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. టోర్నమెంట్లో రాబోయే మరిన్ని కీలక మ్యాచ్‌లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఇంకా కఠినమైన భద్రతా చర్యలు ఫుట్‌బాల్ ఫ్యాన్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
🇧🇪🇸🇳 ఒక వ్యక్తి బెల్జియం vs సెనెగల్ సమయంలో ప్రదర్శనను దొంగిలించాడు, ఇది ప్రధాన ప్రకటన స్థలం వలె డ్యూయెల్ షర్ట్‌ను ఊపుతూ పిచ్ మీదుగా పరుగెత్తాడు.
టోర్నమెంట్ యొక్క మార్కెటింగ్ స్టంట్ లేదా జీవితకాల FIFA నిషేధం స్పీడ్‌రన్?
రచయిత: Valpic.twitter.com/cGqVAQWwye
— మారియో నౌఫల్ (@MarioNawfal) జూలై 2, 2026

