ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం మరోసారి విచారణకు సిద్ధమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇదే కేసులో అనేక మందిని విచారించారు.
దేవరకద్ర ఎమ్మెల్యేకు…
తాజాగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల సమయంలో మధుసూదన్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయనను విచారించేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి స్టేట్మెంట్ సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు.

