డిజిటల్ చెల్లింపులు: ఒకప్పుడు పర్సులో నగదు పెట్టుకుని వెళ్లేవాళ్ళు. ప్రతి ఖర్చులకు ఆ డబ్బులను చెల్లించేవాళ్ళు. ఒకవేళ జేబులో డబ్బులు లేకపోతే వాటిని కొనుగోలు చేసేవారు కాదు. అత్యవసరం అనుకుంటే అప్పు తీసుకొచ్చి ఆ వస్తువులు కొనుగోలు చేసేవారు.. ఆ తర్వాత అప్పులు తీర్చేవారు. ఇది ఒక పద్ధతి. అందువల్లే చాలా కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం కొనసాగుతూ ఉండేది.
ఇప్పుడు జేబులో డబ్బు లేకపోయినా పర్వాలేదు. కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అవసరాలు తీర్చుకోవచ్చు. హోటల్లో తాగే టీ నుంచి.. విమానంలో ప్రయాణించే వరకు కూడా డిజిటల్ పేమెంట్ల ద్వారానే సాగిపోతోంది.. కొన్ని సందర్భాల్లో డబ్బు ఎంతైనా పర్వాలేదు జస్ట్ స్కాన్ చేస్తే సరిపోతుంది. అందుకే నేటి యువతరం నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు అందరూ డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడుతున్నారు. మారిన కాలానికి డిజిటల్ పేమెంట్స్ వాడటం సరైనదే అయినప్పటికీ.. దీనివల్ల మనకు తెలియకుండానే జేబులకు చిల్లుపడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
“ఆన్లైన్ విధానంలో జరిగే చెల్లింపులు మన జీవితాలను అత్యంత సులభతరం చేశాయి. అయితే ఇలాంటి ఈజీ చెల్లింపులకు అలవాటు పడటం వల్ల తెలియకుండానే ఖర్చులు పెరిగిపోతున్నాయి. నగదు నోట్లను లెక్కించినప్పుడు చాలామంది ఇంత ఖర్చు పెడుతున్నారా. వరకు చెల్లించిన చెల్లింపులు ఒకసారి లెక్కిస్తే మనకు పెట్టిన ఖర్చు అర్థం అవుతుందని” ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఖర్చుపెట్టిన నగదు కంటికి కనిపించకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇటీవల ఆర్థిక నిపుణులు మనదేశంలో కొన్ని ప్రాంతాలలో సర్వే చేశారు. ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడుతున్నారు. చెల్లింపులను వీటి ద్వారానే చేస్తున్నారు. అందువల్ల చేసిన ఖర్చు అర్థం కావడం లేదు. నగదు ఎలాగైతే వస్తున్నదో.. అంతకంటే వేగంగా ఖర్చవుతుంది. నెల చివరిలో ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు.

