జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; ఫ్యాక్షన్ కు దూరంగా ఉండి ప్రశాంతమైన జీవనాన్ని గ్రామ ప్రజలు గడపాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాక్షన్ బాధిత గ్రామంలో ఓబులనాయనపల్లి ఎస్పీ ఉడాయించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజల అభిప్రాయాలు, సమస్యలు స్వయంగా విన్నవించారు.
ముఖ్యంగా మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామంలో గత పరిస్థితులు, ప్రస్తుత వాతావరణం, ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులపై చర్చించారు. మహిళలు ప్రస్తావించిన సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ , ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళలు, భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పాత కక్షలు, కుటుంబ విభేదాలు, ఫ్యాక్షన్ గొడవలు గ్రామాలకు అడ్డంకిగా మారాయి అన్నారు. ప్రతీకారాలు, హింసాత్మక చర్యలే కాకుండా కుటుంబాల భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుంది.
యువత చెడు అలవాట్లు, మద్యం వ్యసనం, నేరప్రవృత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. క్రిమినల్ కేసుల్లో చిక్కుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు.తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపి విద్య, ఉపాధి, సత్సంస్కారాల వైపు ప్రోత్సహించాలని సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, వివాదాలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే ఘటనలు గమనించిన పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామస్తులు పరస్పర సహకారం, సామరస్యంతో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ను పరిశీలించిన ఎస్పీ గారు, పెండింగ్ కేసులను సమీక్షించి సిబ్బంది ప్రజలకు మరింతగా సేవలందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్సై రాజశేఖర్, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు ఉన్నారు.

