కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీపై ఉన్న మోజు, లేని ఫ్యూచర్‌సిటీపై ఉన్న ఆరాటం పేద విద్యార్థుల ఫ్యూచర్‌పై లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ఏ మాత్రం బాధ్యత లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రేవంత్ రెడ్డి భారంగా చూస్తుండు..
- చదువు మీద ప్రేమ లేదు.. ధ్యాసంతా కమీషన్ల మీదే..
- మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ తాత మధు, ఏనుగుల రాకేష్‌రెడ్డి
- విద్యారంగాన్ని నాశనం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- రేవంత్ రెడ్డిని గద్దె దింపితేనే పేద విద్యార్థులకు భవిష్యత్
- రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు
ఖమ్మం, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీపై ఉన్న మోజు, లేని ఫ్యూచర్‌సిటీపై ఉన్న ఆరాటం పేద విద్యార్థుల ఫ్యూచర్‌పై లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ఏ మాత్రం బాధ్యత లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో పెండింగ్ అని, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై నిర్వహించిన వెబ్సైట్ ఖమ్మం సమావేశంలో పువ్వాడ మాట్లాడుతూ ఏ దేశంలోనైనా విద్య, వైద్యం బాధ్యత ప్రభుత్వానిదే, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ పేద విద్యార్థుల చదువుకు అడ్డంకిగా మారింది. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టారని అసెంబ్లీలో చెప్పిన ఘనత కేసీఆర్‌దని, అవి మంచి పథకాలు అయినందున కొనసాగిస్తామని చెప్పి మరీ కేసీఆర్‌ని కొనసాగించారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బరువుగా భావించకుండా చెల్లించింది. కేసీఆర్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బాధ్యతగా చూస్తే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భారీగా చూస్తున్నదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.25 వేల కోట్లు ఇస్తే, రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ కేవలం రూ.600 కోట్లు మాత్రమే అన్నారు. విద్యాశాఖను సీఎం రేవంత్‌రెడ్డి తన దగ్గర పెట్టుకొని నిర్వీర్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించేవరకు బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.
చదువు పట్ల ప్రేమ లేని ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తుందని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య వల్ల చాలా వరకు కళాశాలలు మూతపడిపోతున్నాయి. చదువు పట్ల ప్రేమ ఉన్నవారు విద్యాశాఖ మంత్రిగా ఉంటే విద్యార్థులకు మేలు జరుగుతుంది. రేవంత్‌రెడ్డికి చదువు పట్ల ప్రేమ లేదని, ధ్యాసంతా కమీషన్ల మీదనే ఉందని. విద్యార్థుల భవిష్యత్ నష్టపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేందుకు పోరాటం చేసింది.
– ఎమ్మెల్సీ తాత మధు
విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం
వేల పాఠశాలలు మూతపడుతున్నాయి.. గురుకులాలు గోస పడుతున్నాయి.. విద్యార్థులకు అందించే పౌష్టికాహారం కలుషితమవుతోంది.. యూనివర్సిటీ భూములు అమ్ముకుంటున్నారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో బొంద పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్‌రెడ్డి ఉన్నారు. రీయింబర్స్మెంట్ విడుదల చేయడానికి ఆయా పార్టీలు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు అభ్యర్థించారు. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. బీఆర్ఎస్ నేత ఆర్జేసీ కృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల అకౌంట్లో వేస్తామని సీఎం చెబుతున్నారు.. పిల్లలు వెళ్లిపోయిన తర్వాత ఫీజు ఎలా వసూలు చేయాలి.
కనీస పరిజ్ఞానం లేకుండా ప్రైవేట్ కళాశాలల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రావి శివరామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బొంతు రాంబాబు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేసే ఆలోచన రేవంత్ ప్రభుత్వం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డిని గద్దె దింపితేనే పేద విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, ఉప్పల వెంకటరమణ, గిరిబాబు, వేణు, బొమ్మెర రామ్మూర్తి, ఇతర పార్టీల నాయకులు మీడగ రామారావు, ఆవుల అశోక్, రమేష్, కేవీ కృష్ణారావు, విద్యార్థి సంఘాల నాయకులు రామకృష్ణ, అశోక్, వెంకటేష్, సురేష్, బషీర్, శేఖర్, ఆజాద్, శ్రీనివాస్ తల్లిదండ్రులు, రాకేష్, విద్యార్థులు ఉన్నారు.
-బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్‌రెడ్డి

