- FCDA భవనం పర్యావరణహిత నిర్మాణం గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు పొందింది.
- 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, 1 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం.
- సచివాలయం తరలింపు ప్రచారం; సీఎం వారంరోజు ఇక్కడి నుంచి పాలన.
భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీలో నిర్మాణం, అభివృద్ది ప్రణాళికలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా దేశంలోనే అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారటీ బిల్డింగ్ (FCDA). పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించకుండా నిర్మించిన, అత్యాధునిక సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు గ్రీన్ బిల్డిండ్ ట్యాంగ్‌ను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఈ సిటీకి సచివాలయాన్ని కూడా తరలించే ప్రక్రియ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రితోపాటు మంత్రుల ఛాంబర్స్ రెడీ అయ్యాయని అంటున్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతోంది..?
హైదరాబాద్ మహానగరం తన పరిధిని విస్తరించడంతోపాటు, జీహెచ్పీని విభజించడంతో పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా చేసిన ప్రయత్నాలు ఎలా ఉన్నా, ఫ్యూచర్ సిటీ అభివృద్దిపైనే కోటి ఆశలు పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఏకంగా 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. భవిష్యత్‌లో 25 లక్షల నుంచి 30లక్షల జనాభా భారత్ ఫ్యూచర్ సిటీలో నివసించేలా మౌలిక సదుపాయాలు, అధునాతన సౌకర్యాలు, విద్యా, ఉపాధి అవకాశాలు.. ఇలా ఒకటేమిటి తెలంగాణ అంటే ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణ అనేంతలా కనీవినీ ఎరుగని రీతిలో వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిన FCDA బిల్డింగ్ ప్రత్యేకతలివే..
ఫ్యూచర్ సిటి అభివృద్దిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వేసిన తొలి అడుగే రికార్డ్ బద్దలు కొట్టింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ది, నిర్మాణ పనులు పర్యావేక్షణ, పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను పరిశీలించడం, పర్యవేక్షించేందుకు చర్ సిటిలో నిర్మించిన తొలి భారీ నిర్మాణం ఫ్యూచర్ సిటి డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్. ఈ నిర్మాణంలో ఎక్కడా పర్యావరణానికి హాని కలిగించే పదార్ధాలు వినియోగించలేదు. పర్యావరణహిత నిర్మాణ ప్రమాణాలు పాటించిన ఇండియన్‌కి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చేత తాజాగా గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు పొందింది దేశం దృష్టిని ఆకర్షించింది. వర్షపు నీటి సంరక్షణకు ఇక్కడ చేసిన ప్రత్యేక ఏర్పాట్లు, 15కిలోవాట్ల సౌరశక్తి సామర్థ్యంతో విత్ ప్లాంట్‌ను నిర్మాణం, ఫ్యూచర్ సిటీ విద్యుత్ అవసరాలకు కొంత భాగం సౌరశక్తిని వినియోగించేలా ప్రణాళికలు రూపొందించడం ఇలా ఒకటేమిటి ఫ్యూచర్ సిటీలో వినూత్న ప్రయోగాలే. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
విదేశీ ప్రతినిధులు, అధికారులు, పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగించినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. FCDA పరిసరాల్లో ఉత్పత్తి అయ్యే సేంద్రియ వ్యర్థాలను వినియోగించేందుకు బయోడైజర్టర్ ప్లాంట్ ఏర్పాటు ఇక్కడ మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. బయోగ్యాస్‌తో పాటు సేంద్రియ ఎరువులను తయారు చేయడంతో, ఫ్యూచర్ సిటీ నూతన భవనం వ్యర్థాల నిర్వహణలో పర్యావరణహిత భవనంగా నిలిచింది. అందుకే ఫ్యూచర్ సిటికీ కేరాఫ్‌గా నిలిచే FCDA బిల్డింగ్ కాలుష్యరహిత నిర్మాణంగా నెట్ జీరో బిల్డింగ్ గా పేరు తెచ్చుకుంది.
వారంలో ఓ రోజు ఫ్యూచర్ సిటీ సచివాలయంలోనే సీఎం, మంత్రులు..
ఫ్యూచర్ సిటి ప్రాజెక్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఇక్కడ అభివృద్ది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాంచి బూస్ట్ ఇచ్చే అంశం. ఈ నేపథ్యంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు, అభివృద్ది భరోసా కల్పించేందుకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. వారంలో ఓ రోజు ఫ్యూచర్ సిటీ నుంచే పరిపాలన నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు FCDA అధునాతన భవనంలో ప్రత్యేక ఛాంబర్లు కూడా ఉన్నాయి.
హైదరాబాద్‌కు సమీపంలో మరో అద్భుత నాల్గో నగరం భారత్ ఫ్యూచర్ సిటీ. ఇక్కడ యంగ్ ఇండియా యూనివర్సిటీ పనులు కూడా అత్యంత వేగంగా జరుగుతున్నాయి. AI టూ గ్రీన్ ఎనర్జీ వరకూ ఫ్యూచర్ సిటీలో ప్రతీ ప్రణాళికా ఓ అద్బుతమే. 3వేల ఎకరాల్లో ఫార్మా, బయో టెక్నాలజీలతో పాటు అంతర్జాతీయ విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, స్కిల్ డెవల్‌పమెంట్, ఇలా అంతర్జాతీయంగా టాప్ 50 కంపెనీలతోపాటు, 1ట్రిలియన్ ఎకానమి టార్గెట్‌గా అనుకున్నది అనుకున్నట్లుగా నిర్మాణాలు పూర్తయ్యాయి, పెట్టుబడులు వెల్లువెత్తితే ఫ్యూచర్ సిటీతోపాటు సీఎం రేవంత్ కూడా తిరుగులేదనే టాక్ పొలిటికల్ సర్కిల్ గట్టిగా వినిపిస్తోంది.
లీఫ్ హెల్మెట్ ధరించిన వ్యక్తి వైరల్ వీడియో | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!

