వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోడీ భేటీ కానున్నారు. 2026, జూన్ 17న ఫ్రాన్స్ వేదికగా ఈ కీలక భేటీ జరగనుంది. ఈ కార్యక్రమం అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ శనివారం (జూన్ 13) అధికారికంగా ధృవీకరించబడింది. ఈ భేటీలో ప్రధాని మోడీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.
కాగా.. 2026, జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్ వేదికగా ప్రతిష్టాత్మక జీ7 కూటమి సదస్సు జరగనుంది. ఈ కూటమిలో ఇండియా భాగస్వామ్య దేశం కానప్పటికీ.. ఈ సదస్సుకు రావాలని భారత ప్రధాని మోదీని ఫ్రాన్స్ ఆహ్వానించింది. ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు మోడీ జీ7 సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా జూన్ 17న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు మోడీ.
►ఇంకా చదవండి |ఎవరైనా సరే.. రూల్స్ బ్రేక్ చేస్తే సహించం: ఇండియాకు అమెరికా కౌంటర్..!
ఈ భేటీలో వాణిజ్యం, ఇంధన సహకారం, హెచ్-1బి వీసా విధానాలు, ప్రాంతీయ భద్రత, పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితులపై ఇరువురు దేశాధినేతలు చర్చించే అవకాశం ఉంది. 2025, ఫిబ్రవరిలో చివరిసారిగా మోడీ, ట్రంప్ ముఖాముఖి భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇరువురు దేశాధినేతలు కలవనుండటం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ట్రంప్, మోడీ ద్వైపాక్షిక భేటీ గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “ఫ్రాన్స్ వేదికగా ప్రధాని మోడీ, ట్రంప్ భేటీకి ముహూర్తం ఫిక్స్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

