బంగారం ధర గత రెండేళ్లుగా పెరుగుతూనే ఉంది. ఓ సమయంలో బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకుని కాస్త శాంతించింది. ప్రస్తుతం బంగారం ధర కూడా భారీగానే ఉంది. జూలై 15న 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ 770 పెరిగి రూ.1,43,570 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,31,600 కు చేరింది. ధర పెరుగుతున్నప్పటికీ బంగారానికి ఉన్న డిమాండ్ తగ్గడం లేదని అన్నారు. దేశం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారకం కూడా తగ్గుతుంది. అందుకే పసిడి కొనుగోలు తగ్గించాలని కేంద్రం సూచిస్తోంది.
అయినప్పటికీ పసిడికి డిమాండ్ తగ్గలేదు. బంగారానికి పెరుగుతున్న డిమాండ్, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు పసిడి పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపడంతో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగారానికి తాజాగా ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదిక విడుదల చేసింది. భారతదేశంలో బంగారం ఖరీదవుతోందని. కానీ దిగుమతి విలువలో ఈ పెరుగుదలకు బలమైన డిమాండ్ కారణం కాదని ఎస్బిఐ రీసెర్చ్ నివేదిక అందించింది. ప్రపంచ పరిణామాలలో కదలికల్లో పెద్ద పాత్ర పోషిస్తున్నాయని.
బంగారం దిగుమతి పరిమాణం, విలువ పరంగా విభిన్నంగా ఉందని ఎస్బిఐ రీసెర్చ్. దిగుమతి పరిమాణాలు తక్కువగా దిగుమతి బిల్లు వేగంగా పెరుగుతోందని. బంగారం దిగుమతి కోసం 2025 ఆర్థిక సంవత్సరంలో 57.9 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే అది ఈ సంవత్సరం 72. 4 బిలియన్ డాలర్లకు పెరిగింది. కరెంట్ అకౌంట్ లోటు పై బంగారం ప్రభావం ఆందోళన కలిగించే విషయమని గుర్తు చేసింది. పశ్చిమ సంక్షోభం కారణంగా ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను 15 శాతం పెంచింది.
2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రూపాయి విలువ పడిపోయింది. అప్పుడు క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ (CAD)ని నియంత్రించేందుకు భారత్ బంగారం దిగుమతి పన్నును 15 శాతం పెంచింది. ఈ నేపథ్యంలో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని.
డిస్క్లైమర్: ఈ వెబ్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సైట్లు మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కానీ, ఆమోదించడం కానీ బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించడం. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

