ఆంధ్రప్రదేశ్:తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ద పాలన నిజంగా అమలవుతుందా? లేక అధికార పార్టీలకు,కేంద్రంలో ప్రభావం ఉన్న నేతలకు వేరే న్యాయం,సామాన్య ప్రజలకు వేరే న్యాయమా? అనే ప్రశ్నలు నేడు ప్రజల్లో తీవ్రంగా వినిపిస్తున్నాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ ( మేడ శ్రీనివాస్ )ప్రశ్నించారు.ఫోక్సో వంటి కఠిన చట్టాలు చిన్న చిన్న ఘటనల్లో వెంటనే అమలవుతున్నాయి.
సామాన్య కుటుంబాలకు చెందిన యువకులపై గంటల వ్యవధిలో కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్న పోలీసులు,బీజేపీ జాతీయ నాయకుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారు? చట్టం ముందు అందరూ సమానమైతే,ఈ కేసులో ప్రత్యేక వైఖరి ఎందుకు రూపొందించబడింది? ప్రజల్లో పెరుగుతున్న అనుమానాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
కేసు నమోదై రోజులు గడుస్తున్నా,ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం వెనుక రాజకీయ ఒత్తిడులున్నాయా? లేక కేంద్ర నాయకత్వాన్ని అసంతృప్తికి గురి చేయకూడదనే భయమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇక మరలా ప్రజల దృష్టి మళ్లించేందుకు కాలం చెల్లిన ఇంటి తనిఖీలు, హడావుడి కార్యక్రమాలు అసలు పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా పారదర్శకతకు కట్టుబడి ఉంటే,ఈ కేసులో నిష్పక్ష విచారణ జరిపి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.బండి సంజయ్ ( బండి సంజయ్ )ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా,చట్టం కంటే ఎవరూ గొప్పవారు కాదని నిరూపించారు.
బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలి.అప్పుడు మాత్రమే ప్రజల్లో చట్టంపై విశ్వాసం పెరుగుతుంది.లేదంటే “అధికారులకు ఒక న్యాయం– సామాన్యులకు మరో న్యాయం” అన్న అభిప్రాయం మరింత బలపడుతుంది.
రాజకీయ ప్రభావం లేకుండా న్యాయం జరగాలి.అదే ప్రజాస్వామ్యానికి బలం అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ అన్నారు
.


