ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బక్రీద్ హాలిడే మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బక్రీద్ సెలవును ఈ నెల 27వ తేదీన కాకుండా 28వ తేదీకి ప్రభుత్వం మార్చింది. ముస్లిం సోదరుల సూచనల మేరకు ప్రభుత్వం బక్రీద్ సెలవును 28వ తేదీకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
28వ తేదీకి మారుస్తూ…
గతంలో ప్రభుత్వం ఈ నెల 27 బుధవారం సెలవు దినంగా ప్రకటించింది. కానీ కొందరు చేసిన సూచనలతో ప్రభుత్వం సెలవు దినాన్ని ఒకరోజు ముందుకు జరిపింది. ప్రస్తుతం నవంబర్ 28 తేదీ అంటే గురువారం సెలవు దినంగా కూడా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ ఉత్వర్వులు జారీ చేశారు.

