- బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్తగా నాలుగు వేరియంట్లలో విడుదలైంది.
- C35 సిరీస్‌లో మూడు, C30 సిరీస్‌లలో ఒక మోడల్ అందుబాటులోకి వచ్చింది.
- కొత్త మోడల్స్ మెరుగైన రేంజ్, ఫీచర్లు, డిజిటల్ డిస్ప్లేలతో వస్తున్నాయి.
- ధరలు స్వల్పంగా పెరిగాయి, పెరిగిన ఫీచర్లతో సమంజసంగా ఉన్నాయి.
బజాజ్ చేతక్ 2026 అప్డేట్లు:భారతీయ రోడ్లపై ఒకప్పుడు రాగా వెలిగిన చేతక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో సరికొత్త సంచలనాలు క్రియేట్ చేస్తోంది. బజాజ్ ఆటో తన పాపులర్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌పోలియోను తాజాగా అప్డేట్ చేసింది. ఈసారి కేవలం ఒక మోడల్ మాత్రమే కాదు ఏకంగా నాలుగు విభిన్న వేరియంట్లను(C3501 C3502 C3503 C3001) వినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చింది.
కొత్తగా మారెక్ట్లోకి వచ్చిన బజాజ్
టెక్నాలజీ మారుతున్న కొద్దీ అవసరాలు కూడా మారుతుంటాయి. ఈ ఆహారాన్ని దృష్టిలో పెట్టుకొని బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఖచ్చితమైన మార్పులు చేసింది. అటు రేంజ్ పరంగా, ఇటు ఫీచర్ల పరంగా ఈ కొత్త మోడల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి.
సీ 35, సీ30తో లైనప్ అప్డేట్
బజాజ్ చేతక్ తన ప్రస్తుత లైనప్‌ను సీ 35, సీ30 అనే రెండు ప్రధాన సిరీస్‌లుగా డివైడ్ చేసింది. సి35లో మూడు మోడల్స్ ఉన్నాయి. ఇవి సీఐ 3501, సీఐ 3502, సీ3503. ఇవి ప్రధానంగా ఎక్కువ రేంజ్, హై ఎండ్ ఫీచర్లు కోరుకునే వారి కోసం రూపొందించారు.

సీ 30 సిరీస్‌లో సి 3001 మోడల్ ఉంది. ఇది బడ్జెట్, పనితీరు మధ్య తగినతను కోరుకునే వారికి సరైన ఎంపిక. ఈ అప్డేట్లో ప్రాథమిక బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ సమయం, డిజిటల్ డిస్ప్లేలలో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీ 3501 మోడల్ 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ టీఎఫ్టీ డిస్ప్లేతో రావడం ఈ అప్డేట్లో హైలైట్.
ఈ కొత్త లైనప్ స్కూటర్లను బజాజ్ ఏప్రిల్ నెలలోనే అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇప్పుడు వాటి పూర్తి ధరలు, స్పెసిఫికేషన్లను తాజాగా ఉంచారు. ప్రస్తుతం ఇవి ప్రధాన నగరాల్లో బజాజ్ షోరూమ్స్‌లో ఉన్నాయి.
మార్కెట్లో పెరుగుతున్న పోటీని ఎదుర్కోవడానికి, వినియోగదారులకు మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనుభూతిని అందించడానికి బజాజ్ ఈ మార్పులను చేసింది. గతంలో ఉన్న మోడళ్లతో ప్రస్తుతం, మోడళ్లలో రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను రూపొందించడానికి టెక్ ప్యాక్ వంటి అదనపు ఫీచర్లను కూడా జోడించారు.
అప్డేట్ల కారణంగా ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
మోడల్ |
కొత్త ధర |
పాత ధర |
వ్యత్యాసం |
| సీ 3501 | 1,44,305 | 1,39,305 | 6500 పెరిగింది. |
| సీ 3502 | 134,105 | 1 27 605 | 6500 పెరిగింది. |
| సీ 3503 | 120605 | 118 605 | 2000 పెరిగింది |
| సీ3001 | 110006 | 107 606 | 2400 పెరిగింది. |
ధరలు కొంత మేర పెరిగినప్పటికీ అందించే ఫీచర్లు, పెరిగిన రేంజ్‌తో పోలిస్తే ఇది సమంజసమే నిపుణుల అభిప్రాయం.
మోడల్స్ మధ్య తేడాలు ఏంటి
నాలుగు మోడళ్ల మధ్య ఉన్న ప్రధాన తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. రేంజ్ విషయానికి వస్తే సీఐ 3501, సీ 3502 గరిష్టంగా 153 రైజ్ అందిస్తాయి. సీ 3503 మోడల్ 151 కిల్లు, ఇక ఎంట్రీ లెవల్ సీ 3001 మోడల్ 127 రైజ్ ఇస్తాయి.

సీ 35 సిరీస్ మోడళ్లలో 3.5kWh బ్యాటరీ ఉండగా, సీ 3001లో 3.0kWh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే సీ 3501 మోడల్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో వస్తుంది. ఇది 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవ్వడానికి 3 గంటల సమయం తీసుకుంటుంది. మిగిలిన మోడల్స్ ఆఫ్ బోర్డ్ ఛార్జర్‌తో వస్తాయి.
సీ3501 మోడల్ 5 ఇంచ్ టచ్‌స్క్రీన్ టీఎఫ్టీ కలిగి ఉంది. సీ 3502 మోడల్లో 5 ఇంచుల టీఎఫ్టీ స్క్రీన్ ఉంది కానీ టచ్ సౌకర్యం లేదు. సీఐ 3503, సీఐ 3001లో కలర్ ఎస్డీసీ డిస్ప్లే మాత్రమే ఉంది.

ఈ స్కూటర్లన్నీ బజాజ్ సిగ్నేచర్ స్టీల్ బాడీతో వస్తున్నాయి. ఇది ప్లాస్టిక్ బాడీ స్కూటర్ల కంటే గట్టిగా ఉంటాయి. వానలో నీటిలో వెళ్లినా బ్యాటరీ తడికి ఎలాంటి ప్రమాదం ఉండదు. పార్కింగ్ సమయంలో స్కూటర్లను వెనక్కి తీసుకోవడం కోసం రివర్స్ మోడ్ కూడా కలిగి ఉంది. కొండ ప్రాంతాలు లేదా ఎత్తులో స్కూటర్ వెనక్కి వెళ్లిపోకుండా హిల్ హోల్డ్స్ ఉన్నాయి. 35 లీటర్ స్టోరేజ్ సామర్థ్యంతో పెద్ద హెల్మెట్‌ను కూడా సులభంగా పెట్టుకోవచ్చు.
ఇంకా చదవండి

