ఎన్టీఆర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. మూలపాడు బటర్ఫ్లై పార్కును సందర్శించారు. బటర్ఫ్లై పార్కులో సీడ్ బాల్స్, తెల్ల పొనికి చెట్లను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాటారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన మొక్కలు నాటారు.
స్టాల్స్ ను సందర్శించి…
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. బటర్ ఫ్లై పార్కును సందర్శించిన పవన్ కల్యాణ్ అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కూటమి పార్టీ నేతలు ఉన్నారు.

