Realme 16T ఫోన్ ధర మరియు ఫీచర్లు: స్మార్ట్ ఫోన్ కంపెనీలలో మీ రియల్ కి మనదేశంలో బలమైన మార్కెట్ ఉంది. ఈ కంపెనీ బడ్జెట్, ప్రీమియం ఫోన్లను తయారు చేస్తూ ఉంటుంది. తాజాగా మనదేశం మార్కెట్ లో మీ 16 టీ మోడల్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ పూర్తిగా బడ్జెట్ పద్మనాభాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించింది.
లక్షణాలు
ఇందులో 8000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. 50 మెగా ఫిక్స్ కెమెరా ఉంది. ఏఐ పోర్ట్రెయిట్ గ్లో, ఏఐ ఇన్ స్టంట్ క్లిప్ వంటి సదుపాయం ఉంది. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. ఫోన్ లో ఎల్ సీడీ స్క్రీన్ ఉంది.
ఈ మోడల్ లో డిస్ ప్లే 6.8 ఆంగుళాల వరకు ఉంది. 144హెచ్ జడ్ రిప్రేష్ రేట్ కలిగి ఉంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంది. మీడియా టెక్ డైమెన్ సిటీ 6300 ప్రాసెసర్ ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్ మీ యూఐ 7 ద్వారా ఇది పని చేస్తుంది. 50 మెగా ఫిక్స్ సోనీ ఐఎంఎక్స్ 852కెమెరా ఇందులో ఉంది. 2 మోనో క్రోమ్ కెమెరాలు కూడా ఉన్నాయి.
వెనక వైపు సెల్పీ మిర్రర్ ఉంది. పంచ్ హోల్ దగ్గర డిస్ ప్లే ప్రాంతంలో ఏకంగా 16 మెగా ఫిక్సల్ కెమెరా ఉంది. 8000 ఎంఏహెచ్ బ్యాటరీ 45 వాట్స్ సూపర్ వూక్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. 6.5 వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉంది.
ధరలు ఎలా ఉన్నాయంటే
ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6 జీబీ 128 జీబీవేరియంట్ 29,999, 8 జీబీ, 128 జీబీ వేరియంట్ 31,999, 8 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర 34,999 ధరలలో లభిస్తున్నాయి. రెడ్ కలర్, స్టార్ లైట్, స్టార్ లైట్ బ్లూ వంటి రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. మరో ఐదు రోజుల్లో అమ్మకాలు మొదలవుతాయి. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా రూ.మూడు వేలవరకు డిస్కౌంట్ లభిస్తుందని రియల్ మీ కంపెనీ ప్రకటించింది.

