హైదరాబాద్ బషీర్ బాగ్లో ఒంటరిగా వెళ్తున్న ఓ యువతి పట్ల కొందరు కిరాతకులు అసభ్యంగా ప్రవర్తించారు. మే 27 బుధవారం రాత్రి బషీర్ బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఈ దారుణం జరిగింది. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతిని చూసి… ఐదుగురు నేపాలీ యువకులు రెచ్చిపోయారు. నడిరోడ్డుపైనే ఆమె చేయి పట్టి లాగుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఊహించని పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన యువతి.. ధైర్యం చేసి గట్టిగా కేకలు వేసింది.
యువతి అరుపులు విన్న చుట్టుపక్కల ప్రజలు, స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పారిపోవడానికి ప్రయత్నించిన ఆ ఐదుగురు నేపాలీలను చుట్టుముట్టి నిర్బంధించారు. నడిరోడ్డుపైనే వారికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితులను అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.
పోలీసుల విచారణలో వీరంతా స్థానికంగా ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని తేలింది. నిందితులను సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్ నెవుపనేలుగా పేర్కొన్నారు. ఈ ఐదుగురిపై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు… దర్యాప్తును వేగవంతం చేశారు. నడిరోడ్డుపై, అది కూడా పోలీస్ కార్యాలయం ముందే ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “బషీర్ బాగ్ లో కలకలం…యువతి చేయి పట్టుకుని లాగిన నేపాల్ గ్యాంగ్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

