– ప్రకటన –
– ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ రష్ పెరుమాళ్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి త్వరగా పరిష్కారం లభించేలా చూపించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ స్పష్టం చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ తనిఖీ చేశారు. కార్యాలయానికి చేరుకున్న కమిషనర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆమె కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా సీపీ రష్మీ పెరుమాళ్ కార్యాలయ పరిసరాలను పరిశీలించి, పోలీస్ స్టేషన్‌లోని అన్ని రకాల రికార్డులను మరియు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను నిశితంగా పరిశీలించారు.
అనంతరం ఏసీపీ సదానందంకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో మరియు ఇతర గ్రేవ్ కేసుల దర్యాప్తును నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని నిర్ణయించారు. కార్యాలయానికి సంబంధించిన అన్ని రికార్డులను అప్డేట్ చేస్తూ, పారదర్శకంగా ఉంచాలని. కార్యాలయానికి వచ్చే ప్రతిదారుడితో ఓపికగా మాట్లాడి, వారి సమస్యలను వినాలని అధికారులకు సూచించారు. . సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలలో సీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేలా కల్పించాలని సూచించారు. సిద్దిపేట పోలీస్ ఉద్యోగమిత్ర పోర్టల్ గురించి అన్ని గ్రామాలలో యువతకు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందంతో పాటు హుస్నాబాద్ సీఐ శ్రీధర్, చేర్యాల సీఐ రమేష్, ఎస్ఐలు మహేష్, లక్ష్మారెడ్డి, ప్రశాంత్, అభిలాష్ పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
– ప్రకటన –

