కోల్‌బెల్ట్, వెలుగు: బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. శనివారం సాయంత్రం పొద్దుపోయాక మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో ఉంది. ఈ సందర్భంగా ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొంది హైదరాబాద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సీనియర్ కాంగ్రెస్ లీడర్ గాండ్ల సమ్మయ్యను, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆర్కే4 గడ్డపై చేరిన కార్యకర్త రామగిరి శ్రీనివాస్‌ను ఎంపీ వంశీకృష్ణ పరామర్శించారు.
వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్నగర్లోని ఐఎన్టీయూసీ సీనియర్ లీడర్ తేజావత్రాంబాబు ఇటీవల అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఎంపీ వెంట డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ వొడ్నాల శ్రీనివాస్, మాజీ ప్రెసిడెంట్ పల్లె రాజు, సీనియర్ లీడర్లు సదానందన్యాదవ్, యాకుబ్ అలీ, కౌన్సిలర్లు, లీడర్లు ఉన్నారు.

