సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు.. అనుకోకుండా తమ ప్రతిభను బయటపెట్టుకున్నపుడు అందరూ ఆశ్చర్యపోతుంటారు. వీళ్లలో ఇంత టాలెంట్ ఉందా.. ఇన్నాళ్లూ ఎందుకు దాచిపెట్టారు అనే అభిప్రాయం కాలిగిస్తుంటారు. నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఇటీవల ఇలాగే ఆశ్చర్యపరుస్తోంది.
ఆమెలో సూపర్ డ్యాన్స్ ఉన్న సంగతి ఇప్పుడిప్పుడే బయటికి వస్తోంది. కొన్ని నెలల ముందు ఒక టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్‌తో కలిసి ఫాస్ట్ బీట్ మ్యూజిక్కు తేజస్విని డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ప్రొఫెషనల్ డ్యాన్సర్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో అదిరిపోయే గ్రేస్‌తో ఆకట్టుకుంది నందమూరి వారమ్మాయి.
ఇప్పుడు మరో డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియాలోకి వచ్చింది తేజస్విని. ఈసారి ఆమె తెలుగులో మోస్ట్ పాపులర్ సాంగ్ అయిన సారంగ దరియా (ల’వ్ స్టోరీ)తో బరిలోకి దిగింది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో హావభావాలు, అద్భుత నృత్యంతో అలరించింది తేజస్విని. ఆమె స్పీడ్, గ్రేస్ మామూలుగా లేవు. ఫస్ట్ వీడియోను మించి ఇది పాపులర్ అయ్యేలా ఉంది.
తేజస్విని ఉత్సాహం చూస్తుంటే.. ఆమె త్వరలోనే సినిమాల్లోకి వస్తుందేమో అనిపిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రానికి ఆమె నిర్మాణ భాగ స్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తేజస్విని జ్యువెలరీ బ్రాండుకు ప్రచారకర్తగా మారి, అందుకోసం ఒక యాడ్ కూడా చేసింది.

