విశాలాంధ్ర-బొమ్మనహాల్: అనంతపురం జిల్లా బొమ్మనహాల్ వారి ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి, ఆమె తల్లిదండ్రుల అనుమతి లేకుండా దేవగిరి శివారులోని పాత ఆంజనేయస్వామి దేవాలయంలో బాల్య వివాహం జరిపిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, క్రైం నెం. 55/2026 కేసుకు సంబంధించి శుక్రవారం బొమ్మనహాల్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ బి. నబీ రసూల్ తన సిబ్బందితో కలిసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో దేవగిరి గ్రామానికి చెందిన బోయ వన్నూరుస్వామి (21), బోయ ఎల్లప్ప (52), బోయమ్మ (47), అలాగే బండూరు గ్రామానికి చెందిన బోయ అంజినేయులు అలియాస్ అంజినయ్య (41), బోయ పల్లవి అలియాస్ మరెక్క (29) ఉన్నారు.

