హైదరాబాద్: రౌడీ షీటర్ దారుణహత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నందనవనంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సూరి అనే రౌడీషీటర్ గతంలో తన భార్య, బావమరిది సల్మాన్ ను హత్య చేశాడు. ఈ కేసులతో వరంగల్, హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరధిలో సూరిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతడిపై నగర బహిష్కరణ కూడా ఉందని పోలీసులు గుర్తించారు. తన రెండో భార్య తమ్ముడు పుట్టిన రోజు సందర్భంగా సూరి నందనవనం వచ్చాడు. ఆ విషయం సల్మాన్ సోదరుడు ఆఫ్రోజ్కు తెలియడంతో అక్కడికి చేరుకొని సూరి కళ్లలో కారం చల్లి పలుమార్లు కడుపులో పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సూరిని స్థానిక ఆసుపత్రికి. ఇప్పటికే రౌడీషీటర్ మృతి చెందాడని వైద్యులు పరీక్షించారు. మీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

